సుమ అడ్డా షో ప్రతీ వారం లాగే ఈ వారం కూడా నవ్వించింది. ఈ వారం "పరేషాన్" టీం ఈ షోకి వచ్చింది. ఇందులో బాహుబలి సీన్ ని రెక్రీట్ చేశారు తిరువీర్, సుమ, రానా. సుమ దేవసేనగా, తిరువీర్ బాహుబలిగా, రానా భల్లాలదేవుడిగా చేశారు. ఎం జరిగింది దేవసేన అని తిరువీర్ అడిగాడు. నేను జంబో బిర్యానీ ప్యాకెట్ తింటుంటే లాగేసుకున్నాడు ఇదిగో ఇతను అంటూ రానాని చూపించింది. ఐతే తప్పు లేదు అన్నాడు తిరువీర్.
తర్వాత రానా మీరు నన్ను అడగండని సుమ అనడంతో "ఏం జరిగింది దేవసేన" అన్నాడు రానా. "నేను బిర్యానీ పొట్లం కోసం లైన్ లో నిలబడి ఉంటే నా చెయ్యి లాగాడు" అని తిరువీర్ ని చూపించింది. "దానికి నువ్వేం చేసావ్" అని అడిగాడు రానా. "వేలు నరికేసాను" అంది సుమ. "నరకాల్సింది వేలు కాదు, బిర్యానీ ప్యాకెట్ ని" అన్నాడు రానా ఫన్నీగా.
"రానా గారు మీ సంక్రాంతి అనుభవాలు ఏమైనా షేర్ చేసుకుంటారా" అని సుమ అడిగింది "సంక్రాంతి అంటే మా ఇంట్లో స్ట్రెస్ ఫుల్ టైం మా ఇంట్లో మూవీస్ రిలీజ్ అయ్యే టైం కదా. ఏ ఫెస్టివల్ కైనా నాకు సినిమాలతోనే సంబంధం తప్పితే దేవుళ్లతో, ఈవెంట్స్ తో సంబంధం తక్కువ " అని చెప్పాడు రానా. "ఎందుకంటే మనకు సినిమాలే దేవుళ్ళు కాబట్టి..కళామతల్లి కాబట్టి" అంటూ సుమ ఫైనల్ టచ్ ఇచ్చింది.